మ‌నీకి అంతం లేదు.. F3 ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్

-

విక్ట‌రీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మ‌ల్టీ స్టార‌ర్ గా వ‌స్తున్న సినిమా F3. 2019 లో విడుద‌ల అయిన F2 సిక్వెల్ గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో F3 సినిమా తెర‌కెక్కుతుంది. కాగ ఈ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ను కాసేప‌టి క్రితం చిత్ర బృందం విడుద‌ల చేసింది. డ‌బ్బు గురించి వివరించే సాంగ్ లో విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మాస్ గేటప్ లో అల‌రిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన మ్యూజిక్ తో ఈ ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ మాస్ గా క‌నిపిస్తుంది.

ల‌బ్ డ‌బ్ అబ్ డ‌బ్.. డ‌బ్బూ.. అని సాగే మ‌నీ సాంగ్ మ‌న జీవితాల‌ను ప్ర‌భావితం చేసేలా ఉంది. కాగ 2019 లో విడుద‌ల F2 సినిమా కామెడీ సినిమాకు కాస్త కామెడీని యాడ్ చేసి F3 ని సినిమాను అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నాడు. కాగ ఈ సినిమాలో విక్ట‌రి వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో పాటు కామెడీయ‌న్ సునీల్ కూడా ఈ సినిమాలో న‌టిస్తున్నాడు. అలాగే F2 సినిమాలో హీరోయ‌న్లు గా చేసిన త‌మ‌న్నా, మెహ్రీన్ F3 లో కూడా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కాగ ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 28 న థియేట‌ర్లులో విడుద‌ల చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version