సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.
ఇక ఇదిలా ఉంటే ఆధార్ కార్డ్ కి సంబంధించిన ఒక వార్త వచ్చింది. ఆధార్ మనకి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఒకటి. అయితే ఆధార్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆధార్ నెంబర్ ద్వారా ఎవరైనా ఎవరి ఆర్థిక కార్యకలాపాలను అయినా ట్రాక్ చేయొచ్చు అని సోషల్ మీడియాలో వచ్చింది. అయితే ఇది నిజమా అబద్దమా అనేది ఇప్పుడు చూద్దాం.
ఆధార్ నెంబర్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్నారు అనేది నకిలీ వార్త మాత్రమే. ఇటువంటి వార్తలు నమ్మకండి ఈ విషయాన్ని యుఐడిఎఐ తెలిపింది. ఎవరి ఆర్థిక సమాచారంని UIDAI కలిగి ఉండదు. కనుక ఆధార్ నెంబర్ ద్వారా ఎలాంటి ఆర్ధిక సమాచారాన్ని పొందలేరు. ఇది ఫేక్ వార్తలు మాత్రమే ఇందులో నిజం లేదు. అనవసరంగా నకిలీ వార్తలను నమ్మి మోసపోకండి.
#AadhaarMythBusters #AadhaarFacts#UIDAI केवल न्यूनतम जानकारी नामांकन/अपडेट के समय लेता हैं , इसमें आपका नाम, पता, लिंग,जन्म तिथि, उंगलियों के निशान, आइरिस स्कैन,और चेहरे की तस्वीर शामिल है।#UIDAI कभी भी निवासी की कोई वित्तीय जानकारी / डेटा नहीं रखती है।
आधार है तो विश्वास है । pic.twitter.com/2GyvM6Eo13— Aadhaar (@UIDAI) September 12, 2022