ఫ్యాక్ట్ చెక్: ప్రైమ్ మినిస్టర్ నేషనల్ లాప్టాప్ స్కీమ్ 2022 గురించి విన్నారా..? వారికి లాప్టాప్స్..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు.

పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

ప్రైమ్ మినిస్టర్ నేషనల్ లాప్టాప్ స్కీం 2022 గురించి ఒక వార్త వచ్చింది. అయితే నిజంగా ప్రైమ్ మినిస్టర్ నేషనల్ లాప్టాప్ స్కీం 2022 అనేది వుందా..? నిజంగా ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం లాప్టాప్స్ ని ఇస్తోంది..? ఈ విషయం గురించి చూస్తే.. ప్రైమ్ మినిస్టర్ నేషనల్ లాప్టాప్ స్కీం 2022 అనే స్కీమ్ ఏమి లేదు. http://pmssgovt.online నిజం కాదు. ఇది కేవలం నకిలీ వార్త మాత్రమే. ఇటువంటి ఫేక్ వార్తలను అనవసరంగా నమ్మి మోసపోకండి.

Class XI – గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి ప్రైమ్ మినిస్టర్ నేషనల్ లాప్టాప్ స్కీం 2022 కింద లాప్టాప్స్ ని ఇస్తోంది అనడం నిజం కాదు. కనుక ఇటువంటి ఫేక్ వార్తలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి లేదంటే అనవసరంగా మీరే నష్టపోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news