కరోనా వైరస్ మహమ్మారి అయ్యి అందర్నీ పట్టిపీడిస్తోంది. ఈ సమయం లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఎంతో మంది ఆక్సిజన్ లేని కారణంగా ప్రాణాలు వదిలేస్తున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇటువంటి వార్తలు ఎన్నో మనం సోషల్ మీడియాలో చూశాం.
అయితే తాజాగా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఆక్సిజన్ కి బదులుగా హోమియోపతి మందు Aspidosperma Q 20 ఉపయోగించొచ్చు అనే వార్త సోషల్ మీడియా లో షికార్లు కొడుతోంది అయితే ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం..!
ఫ్యాక్ట్ చెక్:
మినిస్టరీ ఆఫ్ ఆయుష్ ట్విట్టర్ వేదికగా తీసుకుని ఈ విషయం లో ఎటువంటి నిజం లేదు అని చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రజలని సొంతంగా నచ్చినట్లు మందులు తీసుకోవద్దని హెచ్చరించింది. డాక్టర్ ని కన్సల్ట్ చేసి మాత్రమే అవసరమైన మెడిసిన్స్ తీసుకోవడం మంచిదని చెప్పడం జరిగింది.
అసలు ఈ మందు ఏమిటి…?
ఇది హోమియోపతి మందు. రెస్పిరేటరీ సిస్టమ్ లో కలిగే సమస్యలను ఇది నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఎవరైనా ఆస్తమా లేదా ఇన్ఫ్లుఎంజా తో ఇబ్బంది పడితే ఇది శ్వాస తీసుకోవడానికి మరియు చెస్ట్ లో కంజెషన్ ని తగ్గించడానికి మరియు ఎక్కువగా దగ్గుతో బాధపడే వాళ్లకు ఇది మంచి మందు.
కానీ ఇది ఆక్సిజన్ కి బదులుగా వాడడానికి కాదు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం పదేపదే సబ్బుతో లేదా హ్యాండ్ వాష్ తో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి చేయాలి. కరోనా వైరస్ సెకండ్ లెవెల్ ఎక్కువ అయినప్పటి నుంచి ఇటువంటి పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
ప్రజలు వీటిని పట్టించుకోకుండా ఉండడం మంచిది. అలాగే నచ్చినట్లు వైద్యం చేసుకోవడం కూడా మంచిది కాదని గమనించాలి. ప్రమాదం ఏమైనా ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత మాత్రమే మందులని ఉపయోగించడం మేలు. సోషల్ మీడియాలో వచ్చే మందులుని గూగుల్లో సెర్చ్ చేసిన మందుల్ని వాడకండి.