ఫ్యాక్ట్ చెక్: ఆధార్‌ కార్డు పై వైరల్ అవుతున్న మెసేజ్… నిజమేంటి..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి వార్తలు కనపడుతూ ఉంటాయి. దీని వలన చాలా మంది మోసపోతూ ఉంటారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్త నిజం అని అనుకుంటూ ఉంటారు. మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ స్కీమ్స్ మొదలు ఎన్నో వాటికి ఆధార్ కార్డు తప్పనిసరి అయితే ఆధార్ కార్డు కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

మరి అది నిజమా కాదా నిజంగా అక్కడ చెప్పినట్లు చేయాలా అనే విషయాలని ఇప్పుడు చూసేద్దాం. ఆధార్ కార్డు లో మన పేరు వయసు మొదలైన వివరాలు ఉంటాయి దీనితో మోసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రస్తుతం యుఐడిఎఐ పేరుతో ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆధార్ కార్డు వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసిందని వచ్చింది. యూఐడీఏఐ పేరుతో వైరల్ అవుతున్న మెసేజ్ లో ఆధార్ వినియోగదారులు తమ ఆధార్ సంబంధిత సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని ప్రభుత్వం ఒక సలహాని జారీ చేసిందని చెప్పారు. దీనితో పాటు ఏదైనా ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆధార్ కార్డు కాపీని ఎవరితోనైనా షేర్ చేసుకోండి అంటూ వార్త వచ్చింది.

అయితే ఆధార్ కార్డు జెరాక్స్ ని కూడా ఎవరికి ఇవ్వకూడదని ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఇలా చెప్పిందని అందులో ఉంది. మరి ఈ వార్త నిజమా కాదా అనేది చూస్తే ..ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని నమ్మి మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version