గంగవ్వ లాగా పైమాకు కూడా ఇంటికోసం సహాయం చేయండి నాగార్జున గారు..!!

-

తెలుగు బిగ్ బాస్ షో 6సీజన్ చివరి దశకు చేరుకుంది.ఇక 13 వారంలో ఆమె ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో లో ఆకట్టుకున్న పైమా బిగ్ బాస్ లో కూడా జోకులు వేస్తూ ఆకట్టుకుంది . మొదట్లో మంచి ఆట తీరుతో ప్రేక్షకులను అమితంగా అలరించన పైమా తర్వాత రోజుల్లో తన జోరు తగ్గిపోయింది. దానితో ఎలిమినేట్ అయి పోయింది. పేదకుటుంబంలో పుట్టిన పైమా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగింది అంటే అభినిందించాల్సిన విషయమే.

బిగ్ బాస్ షో కు వెళ్ళడానికి ప్రధాన కారణం తన పేదరికం నుండి బయట పడటం తో పాటు అమ్మకోసం సొంతంగా ఇళ్లు కట్టించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. బిగ్‌ బాస్‌ షో తో ఆ కల నెరవేర్చుకోవాలని భావించింది. కాక పోతే ఆమె మధ్యలోనే ఎలిమినేట్ కావడంతో ఆమెకు  ఆమె వారానికి 2.1లక్షలు పారితోషికం ఇవ్వాలని అగ్రిమెంట్ అయ్యిందట. అలాగా  మొత్తంగా 13 వారాలకుగానూ దాదాపు 27లక్షలు రెమ్యూనరేషన్‌గా ఫైమాకి ఇస్తున్నారని తెలుస్తోంది.

ఈ డబ్బులతో  హైదరాబాద్ లో పైమా సొంత ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఆమె అభిమానులు సోషల్ మీడియాలో నాగార్జున గారిని గంగవ్వ కు ఆమెకు వచ్చిన డబ్బుతో పాటు కొన్ని డబ్భులు వేసి సొంతిల్లు కట్టి ఇచ్చినట్లు,పైమా కుటుంబం కు కూడా కట్టించాలని, వారి కుటుంబాన్ని సహాయం చేసి వారి కల నెరవేర్చాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కింగ్ నాగార్జున వారి మొర వింటాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version