నల్గొండ: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి ముగ్గురు సాగర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు, ఆరోగ్య, కుటుంబ సమస్యలే కారణమని తెలుస్తోంది. కొత్త బ్రిడ్జిపై నుంచి సాగర్ లోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు నాగమణి, రామయ్య, సాత్విక్‌గా గుర్తించారు.
నిన్నటి వరకూ ఎంతో ఉత్సాహంగా కనిపించిన కుటుంబం.. ఒక్కసారిగా మృత్యుఒడిలోకి వెళ్లిపోవడంతో స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. వారితో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు.