ప్రత్యూష సూసైడ్‌ కేసు దర్యాప్తు ఆశ్చర్యపరిచే విషయాలు..

-

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష గరిమెళ్ల ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే.. ఆమె ఆత్మహత్య కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చిన ప్రత్యూష పది రోజుల ముందుగానే అందుకు మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, నొప్పి తెలియకుండా సునాయాసంగా ఎలా చనిపోవాలన్న దానిపై ఇంటర్నెట్‌లో వెతికి వివరాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం ద్వారా ఎలాంటి బాధ లేకుండా చనిపోవచ్చని తెలుసుకుని అది కొనుగోలు చేశారు. దానిని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకోవడం కుదరదని భావించిన ప్రత్యూష అందుకు తన బొటిక్‌ను సరైన ప్లేస్‌గా ఎంచుకున్నారు. ఆత్మహత్యకు వారం రోజుల ముందు బాత్రూంలోని కిటికీలు, ఎగ్జాస్టర్ ఫ్యాన్ ప్రాంతాన్ని మూయించేసినట్టు గుర్తించారు పోలీసులు. శుక్రవారం ఉదయం రెండుసార్లు బయటకు వెళ్లిన ఆమె సాయంత్రం నాలుగున్న గంటల సమయంలో తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఆమె వద్ద పనిచేసే దుర్గ.. తాను కిరాణా దుకాణానికి వెళ్తున్నానని ప్రత్యూషకు చెప్పారు. వెళ్లమని చెప్పిన ఆమె పని ఉంటే పిలుస్తానని, లోపలికి రావొద్దని చెప్పి పంపించారు. ఆ తర్వాతి రోజు ఉదయం గది నుంచి ప్రత్యూష బయటకు రాకపోవడంతో దుర్గ దంపతులు తులుపు తట్టినా తీయలేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రత్యూష తండ్రి, డ్రైవర్ వచ్చినట్టు దుర్గ, ఆమె భర్త వీరబాబు పోలీసులకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version