ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరుగనుందని ప్రకటించారు చిన్న జీయర్ స్వామి. ఫిబ్రవరి రెండు నుంచి పన్నెండు వరకు శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని తెలిపారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గత ఏడాది ఫిబ్రవరి 2న ప్రారంభమైంది.. 216 అడుగుల పంచలోహ విగ్రహం లోకానికి అందుబాటులోకి వచ్చిందన్నారు.
సమతా మూర్తీ కేంద్రం ప్రారంభమయ్యి ఏడాది పూర్తి అవుతుంది.. 108 దివ్య దేశాలు సమతా మూర్తి కేంద్రంలో ఉన్నాయి.. కోట్లాది మంది సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించారని తెలిపారు చిన్నజీయర్ స్వామి. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను చూసారు.. చూస్తూ చూస్తుండగానే ఒక ఏడాది పూర్తి అయ్యింది.. ఫిబ్రవరి 2 న మొదటి వార్షికోత్సవం జరుపుతున్నామని తెలిపారు. గతేడాదిలాగే అదే క్రమంలో కార్యక్రమం సాగుతుంది.. 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నామని వెల్లడించారు. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు చిన్నజీయర్ స్వామి.