పాదాలలో దురదలు వస్తుంటే ఈ ఇంటి చిట్కాలని పాటించండి..!

-

ఒక్కొక్కసారి మనకు అరికాళ్ళలో, పాదాలకి దురద వేస్తుంది. దురద కలిగినప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాము. ఎంతసేపు చూసినప్పటికే కూడా తగ్గదు. ఒకవేళ కనుక అరికాళ్ళలో నిజంగా దురద వేస్తే ఈ విధంగా ఫాలో అవ్వండి. ఇలా కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా ఆ దురద వెంటనే తగ్గుతుంది. మరి ఆలస్యం ఎందుకు ఆ ఇంటి చిట్కాల గురించి చూసేద్దాం.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. మీ కాళ్ళకు ఎక్కడ దురద వేస్తుందో అక్కడ ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయండి. నూనె ఆరిపోయే అంత వరకు కూడా అలా ఉంచండి. అప్పుడు తప్పకుండా దొరుకుతుంది.

అలోవెరా జెల్ :

చర్మానికి అలొవెరా జెల్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మీ పాదాలు లేదా అరికాళ్లలో ఎక్కడైతే దురద కలుగుతుందో అక్కడ అలోవెరా జెల్ ను అప్లై చేయండి ఇది కూడా దురదని మాయం చేస్తుంది.

నిమ్మ:

నిమ్మ కూడా చాలా రకాల సమస్యలను తొలగిస్తుంది. నిమ్మరసాన్ని మీరు దురదగా ఉన్న ప్రాంతంలో రాయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోండి. ఇది కూడా దురదను తొలగిస్తుంది.

సాల్ట్:

సాల్ట్ కూడా దురదని తొలగిస్తుంది. ఒక టబ్ లో గోరువెచ్చని నీళ్లు వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి మీ పాదాలను అందులో ఉంచండి. పదిహేను నుండి ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తర్వాత కాళ్ళని తుడిచి మాయిశ్చరైజర్ రాయండి. ఇలా కూడా దురదని తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version