బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్‌రెడ్డి సందర్శించారు. తొలిసారి కమాండ్ కంట్రోల్‌కు వచ్చిన ఆయనకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.అనంతరం అక్కడి సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్‌లను ముఖ్యమంత్రి పరిశీలించారు.
అధికారుల విధుల గురించి తెలుసుకుని, వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నార్కోటిక్స్ బ్యూరోకు బడ్జెట్ కేటాయించిన నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే ఇతర విభాగాల అధికారులతోనూ ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణశాఖతో పాటు ఇతర విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్,నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.