టీమిండియా కెప్టెన్ క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు పూర్తైన సందర్భంగా క్రీడాభిమానులు, విరాట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయన ఫొటోలు షేర్ చేసి ట్రెండ్ చేశారు. ఇక ఇటీవల లార్డ్స్ టెస్టులో విజయం తర్వాత కోహ్లీ చేసిన సంబురాలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి. కాగా, ఈ సందర్భంలోనే క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ బ్యాడ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆయన ఏం కామెంట్స్ చేశాడు? అసలేం జరిగిందంటే..భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి కోపం ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే.
బాధ వచ్చినా, సంతోషం కలిగినా విరాట్ కోహ్లీని ఆపడం ఎవరి వల్ల కాదు. కాగా ఈ బిహేవియర్ చూసేనో లేదా ఇంకేదో కారణమో కానీ కోహ్లిని తప్పుబడుతూ ట్విట్టర్ వేదికగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ట్వీట్ చేశాడు. కోహ్లీ నోరు తెరిస్తే అతడి నోటి నుంచి బూతులే ఎక్కువగా వస్తాయని తెలిపాడు. 2012లో కోహ్లీ తనను వేలెత్తి చూపుతూ చేసిన దూషణను తాను మర్చిపోలేదని చెప్పాడు.
ఆ సమయంలో కోహ్లి అలా చేసి తనను తాను తక్కువ చేసుకున్నాడన్నాడు. కోహ్లి చర్యలతో పోలిస్తే.. జో రూట్, సచిన్ టెండూల్కర్, కేన్ విలియమ్సన్ ఎంత హుందాగా ఉంటారో తెలుస్తోందని పేర్కొన్నాడు నిక్ కాంప్టన్. కాగా, కాంప్టన్ వ్యాఖ్యలపై కోహ్లి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విమర్శలను తట్టుకోలేక నిక్ కాంప్టన్ ట్వీట్ తొలగించాడు. అయితే, క్రికెట్ అభిమానులు నిక్ కాంప్టన్ చేసిన ట్వీట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నిక్‌పై ఎదురుదాడికి దిగారు. ట్విట్టర్ వేదికగానే ‘నిక్ కాంప్టన్ నీకు సిగ్గుండాలి’ అంటూ ట్వీట్స్ చేశారు. ఈ క్రమంలోనే నిక్ రియలైజ్ అయి కోహ్లీపైన చేసిన ట్వీట్‌ను తొలగించాడు.