విజయవాడ : కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఇప్పటికే తిరుపతి మరియు విజయవాడ లో పర్యటించారు కిషన్ రెడ్డి. అయితే సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి నేరుగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసానికి బయలుదేరారు కిషన్ రెడ్డి.
కిషన్ రెడ్డి తో పాటు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా సీఎం జగన్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అరగంట పాటు సీఎం నివాసంలో సమావేశమయ్యారు. సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదంపై కూడా వీరిద్దరి సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.