గోదావరిలోకి నలుగురు కుటుంబ సభ్యులు దూకి ఆత్మహత్య

-

రాజమండ్రి మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన కంచి సతీష్ కుటుంబం చించినాడ బ్రిడ్జి పై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల కింద అంటే జూలై 30 న ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇవాళ నలుగురు కుటుంబ సభ్యుల వ్యవహారం బయటపడింది. సతీష్ (34), భార్య సంద్య (28) ఇద్దరు పిల్లలు జస్విన్ (4), శ్రీ దుర్గా (2)ల మృతదేహాలు కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.

ఇందులో ఒక జస్విన్ (4) మృతదేహాం మాత్రమే లభ్యం అయింది. ఇటీవలే గల్ఫ్ నుంచి వచ్చాడు సతీష్. వచ్చిన మరునాడే జూలై 30 తేదీన ద్విచక్ర వాహనంపై చించినాడ బ్రిడ్జి వద్దకు తన కుటుంబం తీసుకొచ్చాడు. ఆ తర్వాత గోదావరిలోకి నలుగురు కుటుంబ సభ్యులు దూకారని సమాచారం. బ్రిడ్జి పై సతీష్ కు చెందిన బైక్ ను గుర్తించిన కుటుంబ సభ్యులు… పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే పోలీసుల దర్యాప్తు లోనే  నలుగురు కుటుంబ సభ్యులు దూకారని తెలిసింది. దీంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. ఇక ఘటన తెలియడంతో బాధిత కుటుంబంలో విస్సహాదం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version