‘మినిస్టర్ సాబ్’: ఆ నలుగురే హైలైట్..!

-

రాజకీయాల్లో నాయకుడుకైన అంచలంచెలుగా ఎదుగుతూ..మంచి మంచి పదవులు సాధించడమే ప్రధాన లక్ష్యం..ఇంకా చెప్పాలంటే మంత్రి పదవి దక్కించుకోవడం అనేది అసలు టార్గెట్. జీవితం ఒక్కసారైనా మంత్రి గారు అని పిలిపించుకుంటే చాలు అని అనుకుంటారు..అందుకే నాయకులు ఎక్కువగా మంత్రి పదవిపైనే ఫోకస్ చేస్తారు…మంత్రి పదవి దక్కించుకోవడం కోసం ఎన్ని ఫీట్లు వేస్తారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ మధ్య జగన్ క్యాబినెట్ లో ఛాన్స్ కొట్టేయడానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా కష్టపడ్డారో అందరికీ తెలిసిందే..ఇదే చివరి ఛాన్స్ అన్నట్లు మంత్రి పదవి కోసం ప్రయత్నించారు.

ఇక చివరికి మంత్రి పదవి ఓ 14 మందికి వరించింది..అంటే పాతవాళ్లని పక్కన పెట్టేస్తే…జగన్ తన క్యాబినెట్ లో కొత్తగా 14 మందికి చోటు ఇచ్చారు…పాతవాళ్లని 11 మందిని మంత్రివర్గంలో కొనసాగించారు…ఇందులో పాత మంత్రుల పనితీరు ఏంటో జనాలకు బాగా తెలిసిందే..ఎవరు సరిగ్గా పనిచేస్తున్నారో, ఎవరు జనంలో తిరుగుతున్నారో, ఎవరు చంద్రబాబుని బాగా తిడతారో, ఎవరు జగన్ కు భజన చేస్తారో కూడా తెలిసిందే. మరి కొత్తగా వచ్చిన మంత్రులు గురించి ఒక్కసారి చూస్తే..ఇందులో కొందరు మాత్రమే బాగా హైలైట్ అవుతున్నారు…అయితే వచ్చిన నెలలోనే ఓ నలుగురు మాత్రం బాగా హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

హడావిడి అంటే మీడియా ముందుకు రావడం కావొచ్చు…కాస్త ప్రజల్లో తిరగడం కావొచ్చు..అలాగే చంద్రబాబుని తిట్టే విషయం కావొచ్చు…జగన్ కు భజన చేసే విషయం కావొచ్చు…ఇలా కొన్ని అంశాల్లో ముందున్నారు. అలా బాగా హైలైట్ అవుతున్న కొత్త మంత్రుల్లో రోజా, అంబటి రాంబాబు ముందు వరుసలో ఉన్నారు. వీరు ఎప్పుడు మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు..అలాగే గుడివాడ అమర్నాథ్, విడదల రజిని లాంటి వారు కూడా కాస్త హైలైట్ అవుతున్నారు. ఈ నలుగురు కొత్త మంత్రులు మాత్రం మీడియాలో బాగా కనిపిస్తున్నారు…అయితే మిగిలిన కొత్త మంత్రులు ఇంకా హైలైట్ అవ్వాలసిన అవసరం ఉంది…విచిత్రం ఏంటంటే…ఇంకా కొందరు మంత్రులు అనే సంగతి ప్రజలకు పెద్దగా తెలియకపోవడం. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇంకెంత మంది హైలైట్ అవుతారో.

Read more RELATED
Recommended to you

Latest news