గణేశ్ చతుర్థిలో RRR స్టార్స్ రామ్, భీమ్.. ఫొటోలు వైరల్

-

అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ RRR ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాతో టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. దేశవ్యాప్తంగా ఈ హీరోలకు ఫుల్ పాపులారిటీ వచ్చింది. సినిమాలో వీరిరువురి గెటప్స్ జనాలకు బాగా నచ్చాయి.

RRR సినిమాలోని ఇరువురు హీరోల గెటప్స్ గణేశ్ చతుర్థి సందర్భంగా మళ్లీ తెర మీదకు వచ్చాయి. అల్లూరి సీతా రామ రాజు గెటప్ లోని రామ్ చరణ్, కొమురం భీమ్ గెటప్ లో ని తారక్ మాదిరిగా ఉండే వినాయకుడి విగ్రహాలు కనబడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ తరహా రామ్ , భీమ్ గెటప్ లోని విగ్రహాలను పలువురు ప్రతిష్టిస్తున్నారు. గణేశ్ చతుర్థి సందర్భంగా ఇలా రామ్ చరణ్, తారక్ మాదిరి గెటప్ గణేశ్ విగ్రహాలు తయారు చేయడం పట్ల ఆయా హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

RRR సినిమా లో తారక్ నటనకు ఆస్కార్ అవార్డు తప్పక వస్తుందని మరో వైపున సినీ అభిమానులు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 అనే పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తుండగా, రామ్ చరణ్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news