ఇన్ని రోజులు దీన్ని పిచ్చి మొక్క అనుకున్నారుగా… ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

-

మన ఇంటి చుట్టుపక్కల, పొలాల గట్టు వెంబడి చాలా మొక్కలు ఉంటాయి. మనకు వాటి గురించి తెలియక అన్నీ పిచ్చిమొక్కలే అనుకుంటాం.. ప్రకృతి ప్రసాదించిన ప్రతీదీ ఒక అద్భుతమే.. అది తెలుసుకోకపోవడం వల్ల మనకు అన్నీ వేస్ట్ మెటీరియల్స్ అనిపిస్తాయి. మన చుట్టూ ఉండే ఎన్నో మొక్కలు ఔషధాల గని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటిదే.. ఈ గంగ పాయల ఆకు. ఈరోజు దీని గురించి చూద్దాం..

మొక్క కాడలు ఆకులు చాలా దళసరిగా ఉంటాయి. పసుపు పచ్చ పూలు పూస్తాయి. గంగ పాయల ఆకుతో కూర కూడా చేసకుంటారట.. పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది. దీనిని గంగ పాయ, గోళీ కూర అని కూడా అంటుంటారు. వీటిలో సన్న పాయల, పుల్ల పాయల, పెద్ద పావిలి, బొడ్డు పాయల అని నాలుగు రకాలు ఉంటాయి..ఈ ఆకులో చాలా పోషకాలు ఉన్నాయి.

గంగపాయల ఆకులో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. అంతేకాదు ఒమేగా3 ఫాటి ఆమ్లాలు, విటమిన్ A ,విటమిన్ బి, ఐరన్, పొటాషియం, కాల్షియంలతో పాటు యాంటి ఆక్సిడెంట్ లు ఉన్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యకు మంచి ఉపశమనం ఇస్తుంది.

మన శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది. బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.. అది గుండె పోటుకు దారితీస్తుంది.

ఇంకా ఈ ఆకులో జింక్ అధికంగా ఉండం వల్ల ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది. కండు పుష్టికి, ఎముకల దృడత్వానికి కూడా ఈ ఆకు బాగా మేలు చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతుందట. విటమిన్‌ ఏ కూడా సమృద్దిగా ఉండటంతో.. కంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

ఈ ఆకులను పేస్ట్ చేసి రసం తీసి పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయట. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకుకూర తింటే మెరుగైన ఫలితాలు వస్తాయట. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి.. ఈ సారి మీకు ఈ ఆకు కనిపిస్తే.. వాడుకోండి. దీంతో.. కూర, పప్పు చేసుకుంటారట.

Read more RELATED
Recommended to you

Latest news