అదిరే పోస్ట్ ఆఫీస్ స్కీమ్…రూ.5 వేలు తో 19 లక్షలు..!

-

చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వున్నారు. దీని వలన భవిష్యత్తు లో ఇబ్బందులేమీ వుండవు. కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. వీటి వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. ఇదిలా ఉంటే పోస్టాఫీస్ కూడా ఎన్నో రకాల సేవింగ్ స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన ఎలాంటి రిస్క్ ఉండదు.

Postoffice

తక్కువ మొత్తం నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో గ్రామ సుమంగళ్ కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెడితే మంచిగా లాభాలొస్తాయి. పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్ అని కూడా దీన్ని అంటారు.

దీనిలో మీరు మాక్సిమం రూ.10 లక్షలు వరకు పెట్టుబడి పెట్టచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యాలంటే కనీస వయసు 19 ఉండాలి. కానీ 40 సంవత్సరాలు దాటి వుండకూడదు. ఇందులో ఇన్వెస్ట్ చేసినవాళ్లు 15 ఏళ్ల ప్రీమియంను ఎంచుకుంటే 6,9,12 సంవత్సరాల కాలవ్యవధిలో చెల్లించిన దానిలో 20 శాతం వస్తుంది. 6 సంవత్సరాలకు 20 శాతం, 9 సంవత్సరాలకు 20 శాతం, 12 సంవత్సరాలకు 20 శాతం ఇలా వస్తాయి.

మెచ్యూరిటీ సమయంలో మిగతా 40 శాతం వస్తుంది. బోనస్ కూడా వస్తుంది. ప్రతి 1000 రూపాయలకు రూ.45 చొప్పున బోనస్ అందిస్తుంది. ఈ పాలసీని 25 ఏళ్ల వయసులో ఎంచుకుంటే గరిష్ట మొత్తం రూ.10 లక్షలు చెల్లించాలి. 15 ఏళ్ళకి తీసుకుంటే నెలకు రూ.6793 చొప్పున పే చెయ్యాలి. అప్పుడు బోన్స్ రూ.6.75 లక్షలు వస్తాయి. 20 ఏళ్లకు రూ.19 లక్షలు వస్తాయి. 20 ఏళ్ల ప్రీమియం తీసుకుంటే నెలకు రూ.5121 పే చేస్తే సరిపోతుంది. ఇలా దీనిలో డబ్బులు పెట్టి ఇలా లాభాలను పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version