కేంద్రం నుండి సూపర్ స్కీమ్.. ఒక్కో ఎకరాకు రూ.లక్ష ఆదాయం..!

-

కేంద్ర ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీముల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. వీటి ద్వారా కోట్ల మంది ప్రయోజనం ని పొందుతున్నారు. చాలా మంది కేంద్రం అందిస్తున్న రక రకాల పథకాలు ని అందుబాటు లో ఉంచింది. రైతుల కోసం కూడా రక రకాల స్కీమ్స్ ని కేంద్రం తీసుకు వచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్‌ లో పీఎం కుసుమ్ యోజన కూడా ఒకటి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..

farmers

ఎకరానికి ఏటా రూ. లక్షల వరకు పొందొచ్చు. ఈ స్కీమ్ వలన ఎక్కువ ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కుసమ్ యోజన స్కీమ్ తో సోలార్ పంపులను ఏర్పాటు చేస్తోంది. 2019 లో ఈ స్కీమ్ ని తీసుకు వచ్చింది కేంద్రం. ఈ స్కీమ్ తో రైతులు ఎలాంటి దిగులు లేకుండా 25 ఏళ్ల పాటు ఆదాయం ని పొందవచ్చు.

ఈ స్కీమ్ కింద రైతులకు వారి పొలంలో సోలార్ పుంపులను ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది. తక్కువ ఖర్చుతో సోలార్ ఎనర్జీ ద్వారా పంటలు సాగు చేసుకోవచ్చు. సబ్సిడీ రేటుకే సోలార్ ప్యానెల్స్ అందిస్తారు. ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయొచ్చు. దానితో అదనపు ఆదాయం పొందొచ్చు. రైతులకు సోలార్ ఎనర్జీ వల్ల కరెంట్ వినియోగం తగ్గుతుంది.

డీజిల్ ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండదు. రైతులకు ఒక ఎకరంపై ఏడాది కి రూ. 60 వేల నుంచి రూ. లక్ష దాకా వస్తాయి. 60 శాతం వరకు రాయితీ కూడా వస్తుంది అలానే ముప్పై శాతం మొత్తాన్ని బ్యాంక్ నుంచి లోన్ తీసుకో వచ్చు. https://www.india.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్‌లైన్‌ లో ఫామ్ ఫిల్ చేసి అప్లై చెయ్యచ్చు. ఆదార్ నెంబర్, ల్యాండ్ డాక్యుమెంట్లు, డికల్రేషన్ ఫామ్, బ్యాంక్ అకౌంట్ అవసరం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news