చర్మం పొడిబారడం, దురద పెట్టడంతో ఇబ్బంది గురవుతున్నారా? ఇంట్లో తయారు చేసుకునే ఈ చిట్కా చూడండి.

-

రుతువు మారడం వల్ల చర్మానికి అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి. అందులో ఒకటి చర్మం పొడిబారడం, రెండు దురద పెట్టడం. చర్మం చికాకుకి గురై అది దురదకి దారి తీస్తుంది. దీన్ని పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన వస్తువులే వాడాల్సిన పనిలేదు. మీ ఇంట్లో ఉన్న వస్తువులతో మీకు కలిసొచ్చే బడ్జెట్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవును, మీరు వింటున్నది నిజమే.

సాధారణంగా చర్మ సంరక్షణకి రకరకాల సాధనాలు వాడుతుంటారు. రుతువు మారినప్పుడలా వాటిని మారుస్తూ ఉంటారు. ఐతే ఒక్కొక్కరి చర్మం ఒక్కో మాదిరిగా ఉంటుంది. అవతలి వారికి సరైనది మీకు సరిగ్గా అనిపించకపోవచ్చు. కాబట్టి మీ చర్మానికి తగిన వాటినే ఎన్నుకోవాలి. అలాంటివి ఎక్కువ ఖరీదు ఉండవచ్చు. అందుకే ఇంట్లోనే తయారు చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మం పొడిబారడం, దురద పెట్టడాన్ని తగ్గించే చిట్కా

కావాల్సిన పదార్థాలు

రోజ్ వాటర్ – 50మిల్లీ లీటర్లు
గ్లిసరిన్- 1టేబుల్ స్పూన్
విటమిన్ ఈ ట్యాబ్లెట్- 1

తయారీ పద్దతి

ఈ మూడు పదార్థాలని ఒకే దగ్గర వేసి బాగా కలపాలి. బాగా మిక్స్ అయిన తర్వాత చర్మానికి పట్టించుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రోజ్ వాటర్ లోని లక్షణాలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. అలాగే గ్లిసరిన్ లోని లక్షణాలు తేమగా ఉంచడంతో పాటు దురదని దూరం చేస్తాయి. చర్మం పొడిబారడం, దురద పెట్టడం నుండి ఇది పూర్తిగా రక్షిస్తుంది. మీరు ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే ఈ చిట్కాని ఉపయోగించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version