ఎన్నికలకు నోడల్‌ అధికారుల నియమించిన రోనాల్డ్‌ రోస్‌

-

అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి నోడల్‌ అధికారులను నియమించి వారికి బాధ్యతలు అప్పగించామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. శానిటేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆర్‌ ఉపేందర్‌ రెడ్డి పవర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. డిప్యూటీ కలెక్టర్‌ శ్రీధర్‌ ఈవీఎం, వీవీ ప్యాట్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారి, రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ప్రసన్నకుమార్‌ ట్రాన్స్‌పోర్టు మేనేజ్‌మెంట్‌, జాయింట్‌ కమిషనర్‌ జయంత్‌రావు మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, ఈవీడీఎం డైరెక్టర్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి ఎంసీసీ నోడల్‌ అధికారిగా నియమించారు.

పోలీస్‌ అడిషనల్‌ కమిషనర్‌ విక్రం సింగ్‌ మాన్‌ లా అండ్‌ ఆర్డర్‌, జిల్లా సెక్యూరిటీ ప్లాన్‌ నోడల్‌ అధికారిగా నియమించారు. ఖైరతాబద్‌ జోన్‌ ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వి. శరత్‌చంద్ర ఎక్సెపెండిచర్‌ మానిటరీ నోడల్‌ అధికారిగా నియమించారు. జీహెచ్‌ఎంసీ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ ఆలీ ముర్తుజా మీడియా, కమ్యూనికేషన్‌ నోడల్‌ అధికారిగా నియమించారు. అడిషనల్‌ కమిషనర్‌ ఎస్టేట్‌ గీతా రాధి ఐటీ రిలేటెడ్‌ నోడల్‌ ఆఫీసర్‌గా నియమించారు. డిప్యూటీ కలెక్టర్లు పద్మప్రియ, అర్చన, శ్రీకాంత్‌ రిపోర్ట్‌ అండ్‌ రిటైన్స్‌ నోడల్‌ ఆఫీసర్లుగా నియమించారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌ సత్యనారాయణ రెడ్డి బేసిక్‌ మినిమమ్‌ ఫెసిలిటీస్‌ నోడల్‌ అధికారిగా, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పద్మజ హెల్త్‌ కేర్‌ ఆఫ్‌ పోలింగ్‌ పార్టీ అండ్‌ ఎలక్టర్స్‌ నోడల్‌ ఆఫీసర్‌గా నియమించారు.

పర్సనల్‌ ఆఫీసర్‌ ఎస్‌డబ్ల్యూఎస్‌ విజయభాస్కర్‌ రెడ్డి బ్యాలెట్‌ పేపర్‌ నోడల్‌ అధికారిగా, జాయింట్‌ కమిషనర్‌ అలివేలు మంగతాయరు, ఎలక్ట్రోరోల్స్‌ నోడల్‌ ఆఫీసర్‌గా నియమించారు. స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ భాషా ఫిర్యాదులు, పరిష్కారం విభాగానికి నోడల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఎస్. ఎల్లా రెడ్డిను నియమించారు. వీరు సంబంధిత నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసే కార్యాలయాల వివరాలను నోటిఫికేషన్ జారీ చేస్తారని రోనాల్డ్ రోస్ తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version