జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 43 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొన్న సంగతి తెలిసిండ్. అర్ధరాత్రి దాటాక అసలు నమోదు శాతం ప్రకటించింది. ఫైనల్ గా 45.71 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రకటించారు. నిజానికి, మంగళవారం సాయంత్రం 5 గంటల వరకూ 36.73 పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.
కానీ, తుది ప్రకటనకు వచ్చేసరికి ఏకంగా 9 శాతం పోలింగ్ పెరగడం ఆసక్తికరం. అయితే అఆరు తర్వాత లైన్ లో ఉన్నవారికి కూడా అవకాశం ఇవ్వడంతో అంత పెరిగిందని చేబుహ్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఓటర్లు ఆశించిన స్థాయిలో పోలింగ్ కేంద్రానికి రాలేదు. ఇక సేటిలర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. 2002 ఎన్నికల్లో 41.22 శాతం, 2009లో 42.95 శాతం, 2016లో 45.27 నమోదయింది.