టీవీ9 కు బిగ్ షాక్.. జిహెచ్ఎంసి భారీ జరిమానా !

-

తెలుగు మీడియా ఛానల్ అయిన టీవీ9 సంస్థకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో భవనానికి నిర్ణీత స్థాయిని మించి టీవీ9 మీడియా సంస్థ బోర్డు ఏర్పాటు చేసింది. అయితే ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా జిహెచ్ఎంసి కి ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. అయితే దీనిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. వేగంగానే స్పందించింది.

ఈ ఘటనపై స్పందించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్… టీవీ9 సంస్థపై ఏకంగా లక్ష రూపాయల జరిమానా వేసింది. ఈ జరిమానాలను ఈ నెల చివరిలోగా చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది జిహెచ్ఎంసి. టీవీ9 మీడియాతో పాటు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న చట్నీస్ హోటల్ పై కూడా లక్ష రూపాయల పెనాల్టీ వేసింది. మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా… అధికారులు ఆ ఎమ్మెల్యేకు కూడా 15 వేల రూపాయల జరిమానా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version