ఈ బంగారానికి ఏమైంది.. ఇవాళ ధర ఎంతో తెలుసా?…

-

హైదరాబాద్: బంగారం ధరల్లో ఎలాంటి మార్పుల్లేవు. బుధవారం ఏ ధర ఉందో గురువారం కూడా అదే ధర కొనసాగుతోంది. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర బంగారం రూ. 44,100గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర బంగారం రూ. 48.110గా కొనసాగుతోంది. ఇక వెండి ధరల విషయానికొస్తే స్వల్పంగా పెరిగింది. కేజీ వెండిపై రూ. 400 పెరిగింది. కేజీ వెండి ధర రూ. 73,400గా అమ్ముతున్నారు. ఇక బంగారం ధరలు తటస్థంగా కొనసాగడానికి జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం సహా బలహీనమైన అంతర్జాతీయ ట్రెండ్ కారణమని వ్యాపారులు అంటున్నారు. ఇక వెండి ధర పెరగడానికి పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడమే కారణమని చెబుతున్నారు.

దేశీయంగా పలుచోట్ల చూసుకుంటే..
చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48.610, 22 క్యారెట్ల బంగారం రూ. 44,560
ముంబై: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,160, 22 క్యారెట్ల బంగారం రూ. 46,160
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,340, 22 క్యారెట్ల బంగారం రూ. 46,250
కోల్‌కత: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,210,22 క్యారెట్ల బంగారం రూ. 46,660
బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,110, 22 క్యారెట్ల బంగారం రూ. 44,100

Read more RELATED
Recommended to you

Exit mobile version