గుడ్‌న్యూస్‌… విమాన టికెట్ల రేట్ల‌లో 30శాతం డిస్కౌంట్‌

-

విమాన ప్ర‌యాణం చేయాల‌నుకునే వారికి ఇప్పుడు ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. రీసెంట్‌గానే కేంద్ర ప్ర‌భుత్వం విమాన టికెట్ల రేట్ల‌ను పెంచింది. దీంతో విమాన ప్ర‌యాణం చేయాల‌నుకునే వారికి పెద్ద దెబ్బే ప‌డింది. అయితే ఇప్పుడు ఓ గుడ్‌న్యూస్ వ‌చ్చింది. స్పైస్ జెట్ విమాన సంస్థ క‌స్ట‌మ‌ర్ల కోసం అదిరిపోయే ఆఫ‌ర్ తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

స్పైస్ జెట్ సంస్థ అన్ని దేశీయ విమానాలపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే ఈ ఆఫర్ కేవలం కొంత మందికే వర్తిస్తుందంట‌. సర్టిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంద‌ని సంస్థ వెల్డిడించింది.

కొవిడ్ 19తో పోరాడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు మాత్ర‌మే ఈ విమాన టికెట్ల రేట్ల‌లో 30 శాతం డిస్కౌంట్ ఉంటుంద‌ని సంస్థ ప్ర‌క‌టించింది. ప్రొఫెషనల్ ఐడీ, రిజిస్ట్రేషన్ నెంబర్ వంటి వాటిని ముందుగా స‌బ్‌మిట్ చేస్తే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. టికెట్ బుకింగ్ సమయంలో ఈ వివరాలు అందిస్తే సరిపోతుంది. అలాగే చెకిన్, బోర్డింగ్ సమయంలో కూడా ఇదే ఐడీ వివరాలు స‌బ్‌మిట్ చేయాలి. కాక‌పోతే ఎయిర్‌పోర్ట్ యూసేజ్ చార్జీలు, ట్యాక్సులు మాత్రం వారే చెల్లించుకోవాలి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version