రుణగ్రహీతలకి హెచ్‌డీఎఫ్‌సీ తీపికబురు..!

-

రుణగ్రహీతలకి గుడ్ న్యూస్ చెప్పింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఇటీవల దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా BOB, పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB కూడా తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ని ఇస్తున్నాయి. అలానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ని ఇస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

hdfc-bank

పండుగ సీజన్ కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్ చెప్పింది. రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. హోమ్ లోన్స్‌కు మాత్రమే వడ్డీ రేట్ల తగ్గింపు వర్తిస్తుంది గమనించండి. దీంతో ఇప్పుడు రుణ గ్రహీతలు 6.7 శాతం వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ పొందొచ్చు. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ 20 నుంచే ఈ వడ్డీ రేట్ల నిర్ణయం అమలు లోకి రావడం జరిగింది.

మీరు తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ పొందాలని అనుకుంటే ఈ బ్యాంక్ ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకోచ్చు. అయితే క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారతాయని గమనించాలి. ఇది ఇలా ఉండగా 2021 అక్టోబర్ 31 వరకు తక్కువ వడ్డీ రేటుకే అంటే 6.7 శాతం వడ్డీ రేటు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఎస్‌బీఐ అయితే హోమ్ లోన్స్‌పై 6.7 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే 6.75 శాతం వడ్డీ వసూలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version