తెలంగాణ ప్రజలకు శుభవార్త.. వారందరికీ ఉచిత డయాలసిస్ సేవలు

-

తెలంగాణ ప్రజలకు శుభవార్త ఆరోగ్య శాఖ శుభ వార్త చెప్పింది. కిడ్నీ వ్యాధి గ్రస్థులైన ఏయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించేందుకు ఆరోగ్య శాఖ సిద్దమౌవుతోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులైన ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలిసిస్ సేవలు అందించాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. హైదరాబాద్ ఒక కిడ్నీ డయాలసిస్ కేంద్రం, వరంగల్ లో మరో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.


ఈ రెండు కేంద్రాల్లో ఐదు బెడ్స్, ఎయిడ్స్‌ పేషంట్లకు, ఐదు బెడ్స్ హెపటైటిస్ పేషంట్లకు కేటాయించి‌ డయాలసిస్ సేవలు అందించాలని సూచించారు. వెంటనే ఈ రెండు‌ కేంద్రాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు‌ చేసి సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు డయాలిసిస్ చేయించకోవడం ఆర్థికంగా చాలా భారంగా పరిమణించిన నేపధ్యంలో సీఎం కేసీఆర్ గారు ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ ఆధీనంలో 43 డయాలిసిస్ కేంద్రాలు నడుస్తున్నాయని. వీటి ద్వారా 10 వేల మంది రోగులకు డయాలిసిస్ సేవలు అందుతున్నాయని చెప్పారు.
సంవత్సరానికి ఇందు కోసం 100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version