నిరుద్యోగులకు గుడ్ న్యూస్..26 వేల పోలీస్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. వివరాలిలా..

-

పోలీస్ ఉద్యోగాలు చెయ్యాలని అనుకోనేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.గత నెల నుంచి ప్రభుత్వం వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.ఇప్పటికే పలు కంపెనీలు కూడా తమ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందుకు సంబందించిన నోటిఫికేషన్ ను కూడా ఇటీవల విడుదల చేశారు..రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా పోలీస్ శాఖ లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది.

పోలీస్ శాఖపై కొన్ని నెలల క్రితం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో పోలీస్ శాఖలో ఖాళీలు, రాష్ట్ర అవసరాలు, కొత్త జిల్లాల తర్వాత అవసరమైన అదనపు పోస్టుల భర్తీపై చర్చించారు. ఈ మేరకు పూర్తి నివేదిక ఇవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.. ఇప్పటికే భర్తీ చేయాల్సిన పోస్టులు, రాష్ట్ర అసరాల దృష్ట్యా అదనపు పోస్టులు మొత్తం కలిపి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలన్నదానిపై సమాచారం సేకరించారు..

రాష్ట్రంలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలిదశలో 6,500 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. మిగిలిన పోస్టులను దశలవారీగా భర్తీ చేయనున్నారు..ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే సీఎం జగన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది.

కాగా, ఏ విభాగాలలో ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు. అనే విషయం పై స్పష్టత రాలేదు.గత ఏడాది ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా దానిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 10వేల ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది..ఇప్పుడు 26 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది..త్వరలోనే ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news