కేంద్ర రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ట్రక్కుల్లో డ్రైవర్ క్యాబిన్లలో తప్పనిసరిగా ఎయిర్ కండిషన్ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. 2025 నుంచి తయారు చేసే అన్ని ట్రక్కుల్లో డ్రైవర్ క్యాబిన్లలో తప్పనిసరిగా ఏసీ ఉండాలని సూచించారు. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న ట్రక్కులోనూ ఏసీ క్యాబిన్లు ఏర్పాటు చేయాలని నితిన్ గడ్కరీ ఆదేశించారు. దీనివల్ల డ్రైవర్లు సులువుగా డ్రైవింగ్ చేయడంతోపాటు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
కంపెనీలు ట్రక్కుల ధరలను పెంచాయని కొంతకాలంగా ప్రజలకు ఫిర్యాదులు వస్తున్నాయని, అయినప్పటికీ క్యాబిన్‌లో ఏసీ సౌకర్యం కల్పించడం లేదని నితిన్ గడ్కరీ అన్నారు. ట్రక్ డ్రైవర్ క్యాబిన్‌లో ఏసీ ట్రక్ క్యాబిన్‌లను తప్పనిసరి చేసే ఫైల్‌పై తాను ఈ రోజు సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు. వేసవి, చలి, వాన సమయాల్లో ట్రక్కు డ్రైవర్లు పగలు, రాత్రుళ్లు డ్రైవింగ్ చేస్తారు.. అయితే వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ట్రక్కు పరిశ్రమను అప్‌గ్రేడ్ చేయడానికి 18 నెలల గడువు ఇచ్చారు.