కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కేంద్రం అందించే స్కీమ్స్ లో
ప్రధాన మంత్రి కుసుమ్ కూడ ఒకటి. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసమని సోలార్ పంపులను అమర్చుకునే సౌకర్యాన్ని ఇచ్చింది. దీనితో రైతులు సౌరశక్తిని ఉపయోగించి తక్కువ ఖర్చుతో వాళ్ళ పంటల్ని చక్కగా పండించవచ్చు. ఈ స్కీము కింద రైతులు తమ భూమి లో సోలార్ ప్యానెల్స్ ని ఏర్పాటు చేసేయచ్చు. ఇలా రైతులు ప్రభుత్వం నుండి సహాయం పొందొచ్చు.
సోలార్ పంపుల ఏర్పాటు కోసం రైతులకు 90 శాతం వరకు సబ్సిడీ ఇస్తారు. కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందొచ్చు. రైతులు పొలాలకు నీటిని అందించడానికి విద్యుత్ గొట్టపు బావులను వాడుతూ వుంటారు. తక్కువ ఖర్చుతో మెరుగైన సౌకర్యాలు ని ఈ పథకం తో పొందొచ్చు. ఇంధన మంత్రిత్వ శాఖ 2019 సంవత్సరంలో దీన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం 30%, రాష్ట్ర ప్రభుత్వం 30%, ఇతర ఆర్థిక సంస్థలు 30% సబ్సిడీ ని ఈ స్కీమ్ తో ఇస్తాయి.
రైతులకు దీనిలో 10% మాత్రమే ఇవ్వాలి. రైతులు విద్యుత్ మరియు డీజిల్ ఖర్చు చేయనవసరం ఉండదు. దీనితో వ్యవసాయానికి అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. అధికారిక వెబ్‌సైట్ https://www.india.gov.in/ని సందర్శించి ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నింపక ఆధార్ కార్డ్, ఖస్రాతో సహా భూమి పత్రాలు, డిక్లరేషన్ ఫారం, బ్యాంక్ ఖాతా వివరాలు వంటివి ఇవ్వాల్సి వుంది.