తెలంగాణ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ అధికారి శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగులో ఇకపై 20 మార్కులు వస్తేనే పాస్ అయినట్లు పేర్కొంది విద్యశాఖ. అయితే ఇది కొందరికి మాత్రమే అమలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగును సెకండ్ లాంగ్వేజ్ ఉన్న పదవ తరగతి విద్యార్థులు ఇకపై వార్షిక పరీక్షలలో 20 మార్కులు సాధిస్తే పాస్ అయినట్లే.
తెలుగు తప్పనిసరి చట్టం – 18లో భాగంగా ఇతర మీడియాలో చదివే విద్యార్థులు తెలుగులో కచ్చితంగా.. ఒక సబ్జెక్టుగా తీసుకోవడం అనివార్యమైంది. అయితే ఇందులో తెలుగును సెకండ్ లాంగ్వేజ్ గా ఎంచుకున్న పదవ తరగతి విద్యార్థులకు ఇకపై వార్షిక పరీక్షలలో 20 మార్కులు సాధిస్తే పాస్ చేస్తామని ప్రకటించింది. దీంతో విద్యార్థులు ఫుల్ ఖుషి లో ఉన్నారు.