తెలంగాణ రైతులకి శుభవార్త…!

-

అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. యాసంగి సీజన్లో పంట పెట్టుబడికి అందించే రైతు బంధు సాయాన్ని డిసెంబర్ లోనే అన్నదాతలకు ఇస్తారట. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారు.

శనివారం వనపర్తి జిల్లా లో పర్యటించిన మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని కూడా అన్నారు. అదే విధంగా ఏ ఇబ్బంది కూడా రైతులకి కలగకుండా చూస్తానని అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించే ధాన్యాన్ని అమ్మి మద్ధతు ధర పొందాలని సూచించారు. పైగా మోసపోవద్దని వడ్లను బాగా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకు రావాలని అన్నదాతలకు చెప్పారు. యాసంగి సీజన్లో సాగుకు నీళ్లు పుష్కలంగా వున్తయన్న విషయాన్ని కూడా చెప్పారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా కూడా చూస్తున్నట్టు వెల్లడించారు. వరి తో పాటు ఇతర పంటల సాగుకు మీద చూపాలని నిరంజన్ రెడ్డి కోరారు. అలానే గ్రూప్-4 ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news