రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ -2 పరీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయమే పరీక్షలు ప్రారంభం కావడంతో అభ్యర్థులు అంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అయితే, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో గ్రూప్-2 పరీక్ష కేంద్రానికి ఓ యువతి ఒక నిమిషం ఆలస్యంగా వచ్చింది.దీంతో పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతిని ఇవ్వకపోవడంతో ఏడుస్తూ తిరిగి ఇంటికి వెళ్లిపోయింది.
పరీక్షా హాల్ టికెట్లు విడుదల చేసినప్పుడే అధికారులు మార్గదర్శకాలను విడుదల చేశారు. పరీక్షా సెంటర్లకు ఆలస్యంగా రాకూడదని ఇప్పటికే గైడ్ లైన్స్ జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆలస్యంగా వచ్చిన యువతిని అనుమతించకపోవడంతో ఏడుస్తూ తిరిగి వెళ్లినట్లు సమాచారం. కాక, రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.