చేటలో చెట్ల అందం చూడతరమా..

-

ఇంటిని మరింత అందంగా చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు..పెయింట్ తో డిజైన్ లు, పేపర్ తో రకరకాల పూలు, మొక్కలు చేయడం అయిపోయింది.ఇప్పుడు ఇంకా కొత్తగా ఏదైనా చేయాలనీ అనుకుంటున్నారు. అందులో భాగంగా మొక్కలను రకరకాలుగా పెంచుతున్నారు.. ఇండోర్‌ ప్లాంట్స్ మంచి డిమాండ్ పెరిగింది..మాములుగా కుండ లో మొక్కలను పెట్టడం చూసి ఉంటారు. పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా కుండలలో పెంచుతారు.కానీ పల్లెల్లో అయితే వెదురు బుట్టలు, తట్టలలో మొక్కలను పెంచుతున్నారు.

 

ఇప్పుడు అదే పట్టణ ప్రాంతాలలో ఇంటి అలంకరణలో భాగం అయ్యింది.ఈ కాలంలో దొరికే ఇంకే పళ్లనో వెదురు బుట్టలో పెట్టి కానుకగా పంపింస్తుంటారు కదా.. ఖాళీ అయిన ఆ బుట్టను మూలన పడేయకుండా ఇలా వాల్‌ డెకార్‌కి వాడుకోవచ్చు. బాల్కనీలోకి పల్లె ఇంటి ఆవరణను తీసుకురావచ్చు అంటున్నారు నిపుణులు..ప్లాస్టిక్‌ చేటలతో గడిపేస్తున్న కాలం ఇది. వెదురుతో అల్లిన చేట నిరుపయోగంగా కనిపిస్తుంటే ఇదిగో ఇలా ఓ మొక్కతో దాన్ని గోడ మీదకు చేర్చండి. ఆ గోడకు క్లాసీ లుక్‌నే కాదు.. చూసే వారికి కూడా ఇది గమ్మత్తుగా ఉంటుంది. అలా వేస్ట్‌ అనుకున్న ప్లాస్టిక్, ఐరన్‌ బాస్కెట్‌లను నార తాడుతో చుట్టి, లేదా గ్లూతో అతికించి అలంకరణ వస్తువుగా మార్చేసుకోవచ్చు.

అందులో ఇండోర్‌ప్లాంట్స్‌ పెడితే నిండే పచ్చదనం.. ఇంటిని చల్లగా ఆహ్లాదకరంగా ఉంచుతుంది. అంటే వేస్ట్‌ను కూడా బెస్ట్‌గా మార్చుకోవచ్చు..ఇలాంటి చిన్న ఆలోచన జనాలను విపరీతంగా ఆకట్టుకోవడం తో పర్యావరణ సంరక్షణను కూడా కాపాడుకోవడం జరుగుతుంది..ఇలాంటి ఆలోచన అందరికి వస్తే బాగుండు మొక్కల పెంపకం పెరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news