దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ అంతా జ్ఞానవాపి మసీదుపై జరుగుతోంది. ఇటీవల వారణాసి కోర్ట్ మసీదు వీడియో సర్వే చేయాలని తీర్పు చెప్పింది. దీని కోసం కోర్టు కమిషనర్లను కూడా నియమించింది. ఈనెల 14-16 వరకు మూడు రోజులు వీడియో సర్వే జరిగింది. అయితే మే 17న వీడియో రిపోర్ట్ ను సమర్పించాలని వారణాసి కోర్ట్ ఆదేశించడంతో… ఈ రోజు వీడియో సర్వేను కోర్టు ముందుంచే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు వజూఖానాలోని బావిలో శివలింగం బయటపడిందని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే కోర్ట్ నియమించిన ఇద్దరు కమీషనర్లు కోర్టును అదనపు సమయం కోరే అవకాశం ఉంది. సర్వే దాదపుగా పూర్తయిందని, సకాలంలో నివేదికను కోర్టుకు సమర్పించేందుకు ప్రయత్నిస్తామని.. ప్రత్యేక సహాయ కమిషనర్ విశాల్ సింగ్ అంటే… కేవలం 50 శాతం నివేదిక మాత్రమే సిద్ధంగా ఉందని.. ఇంకా పూర్తి కాలేదని అసిస్టెంట్ కోర్ట్ కమిషనరల్ ప్రతాప్ సింగ్ అన్నారు. మరో 3-4 రోజుల సమయాన్ని కోరుతామని అన్నారు. ఇదిలా ఉంటే తాజాగా జ్ఞానవాపి మసీదు సర్వేపై స్టే విధించాలని కోరుతూ వారణాసి అంజుమన్ ఇంతేజామియా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ జరుగనుంది.