దావోస్‌లో మంత్రి కేటీఆర్‌ హోర్డింగ్స్.. క్రేజ్‌ మామూలుగా లేదుగా..

-

తెలంగాణలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే.. మంత్రి కేటీఆర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే.. ఆయనకు కేవలం తెలంగాణలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉండడం విశేషం. అయితే.. ఆ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో దావోస్‌లో హోర్డింగ్స్‌ చూస్తే అర్థమవుతుంది. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్‌ దావోస్‌లో పర్యటించనున్నారు.

మరోసారి దావోస్ పర్యటనకు బయలుదేరుతున్న మంత్రి కేటీఆర్‌కు అక్కడ ఘన స్వాగతం పలుకుతూ భారీ హోర్డింగ్స్ వెలిశాయి. అనిల్ కుర్మాచలం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వీటిని ఏర్పాటు చేశారు. దావోస్ లో ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సదస్సులో పాల్గొనేందుకు మన రాష్ట్రం తరఫున మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news