ఆడవాళ్లు అందంపై శ్రద్ధ ఎక్కువగా పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫేషియల్స్ చేయించుకోవడం జుట్టుని అందంగా మార్చుకోవడానికి స్ట్రెయిట్నింగ్ ట్రీట్మెంట్లు చేయించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అమ్మాయిలు మరి మీరు కూడా ఎక్కువగా హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్లకి వెళ్తూ ఉంటారా..? అయితే ఇక నుండి ఆ తప్పు చేయకండి. నిజానికి చాలా మంది అమ్మాయిలు ఈ తప్పులు చేస్తూ ఉంటారు.
హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడం లేదా హెయిర్ స్ట్రీక్ వేయించుకోవడం ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు తాజాగా అధ్యయనం ద్వారా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వీటిని కనుక చూశారంటే ఇంక ఈ పొరపాటు జన్మలో చేయరు.
క్యాన్సర్ ముప్పు ఉందా..?
తరచు హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్లు చేయించుకోవడం వల్ల గర్భాశయం క్యాన్సర్ కలుగుతుందని.. మామూలు మహిళలతో పోల్చుకుంటే వీరిలో రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనం ద్వారా తెలుస్తోంది.
గర్భాశయ క్యాన్సర్ కి అసధారణమైన కారణాన్ని రీసెర్చ్ ద్వారా నిపుణులు కనుగొన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సేఫ్టీ హెయిర్ స్ట్రైట్నింగ్ ఉత్పత్తులని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని అన్నారు.
అలానే యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం హెయిర్ స్ట్రెయిట్నింగ్ ట్రీట్మెంట్ల వల్ల గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని గుర్తించారు. కనుక హెయిర్ స్ట్రైటింగ్ ట్రీట్మెంట్లను తరచుగా తీసుకోవడం మంచిది కాదు. ఇటువంటి వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
తరచుగా ఉపయోగించే వారిలో ప్రమాదం..?
తరచుగా ఉపయోగించే వారిలో ప్రమాదం పెరిగిందని కచ్చితంగా రిస్క్ ఉంటుందని చెప్పారు. సంవత్సరంలో నాలుగు సార్లు ఇటువంటి స్ట్రైట్నింగ్ ఉత్పత్తిని ఉపయోగించే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేల్చేశారు. స్ట్రైటింగ్ ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు దీనికి ప్రధాన కారణం అని అంటున్నారు. రసాయనాల వలనే సమస్యలు కలగొచ్చు అని రొమ్ము క్యాన్సర్ ప్రమాదం కూడా కలగచ్చని అంటున్నారు నిపుణులు. కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది.