తెలుగు దర్శకులపై దృష్టిపెట్టిన మరో హీరో…

-

కొంత కాలంగా తమిళ్ స్టార్ హీరోలంతా తమ సినిమాలను తెలుగులోను రిలీజ్ చూసుకుంటున్నారు. ఇక్కడ కూడా మార్కెట్ ను పెంచుకుంటూ, అభిమానులను సంపాదించుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది. నేరుగా తెలుగు మేకర్స్ తో తెలుగు సినిమా చేసి, దానిని తమిళంలో విడుదల చేసుకుంటున్నారు. అలా విజయ్ చేసిన ‘వారసుడు’ (వరిసు), ధనుశ్ ‘సార్’ (వాతి) సినిమాలు, రెండు భాషల్లోను ప్రేక్షకుల ఆదరణ పొందాయి. దాంతో ఇప్పుడు కోలీవుడ్ హీరోలంతా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. పరాశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కార్తి రెడీ అవుతున్నాడు. ‘సీతారామం’తో గతేడాది తిరుగులేని విజయాన్ని సాధించాడు హను రాఘవపూడి.

పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు సీతారామంతో వచ్చింది. గతేడాది ఆగస్టులో రిలీజైన ఈ సినిమా కమర్షియల్‌గానూ భారీ వసూళ్లను సాధించింది. కాగా సినిమా వచ్చి దాదాపు ఏడు నెలలు అవుతున్నా హను తదుపరి సినిమా ఏంటనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. మధ్యలో పలువురు స్టార్‌లతో సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చినా.. అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. అయితే తాజాగా ఓ తమిళ హీరోతో హను గ్రీన్‌ సిగ్నల్ చెప్పించుకున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్‌లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం హను ఇటీవలే సూర్యకు ఓ కథను నెరేట్‌ చేశాడట. సూర్య కూడా కథ నచ్చడంతో వెంటనే ఒకే చేశాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మించనునన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version