వైవాహిక జీవితం మొదలుపెట్టిన తర్వాత భార్య భర్తల మధ్య ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నిజానికి చాలా మంది ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. పైగా సమస్య వచ్చినప్పుడల్లా బంధం బలహీనమవుతూఉంటుంది కానీ ఆలుమగల మధ్య గొడవలు సహజం.
సర్దుబాటు చేసుకోండి:
చిన్నచిన్న గొడవలు వస్తూ ఉంటాయి కానీ అలా చిన్న చిన్న గొడవలు వస్తున్నప్పుడు వాటిని పెద్దవి చేసుకోవడం మీ తప్పు. సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అదేంటంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.
వాళ్ళకే వదిలేయద్దు:
ఇన్నేళ్ల నుండి కలిసి ఉంటున్నాము ఇదే నన్ను అర్థం చేసుకున్నదా…? నా ఆలోచనలు తెలియవా..?, నేను ఎలా ప్రవర్తిస్తానో తెలియదా..?, నాకు ఏమి ఇష్టమో తెలియదా అని మీ పార్టనర్ ని అనడం తప్పు. ఒక్కోసారి వాళ్ళ ఆలోచనా అంతవరకూ వెళ్లకపోవచ్చు. నిజానికి ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు.
ప్రశ్నలు:
ఎన్నో రకాల ప్రశ్నలు మీరు తెచ్చుకుని అనవసరంగా సఫర్ అవ్వకండి వాళ్ళని సఫర్ అవ్వనివ్వకండి. ఒకసారి మీరు మనసులో అనుకున్న మాట ని వాళ్ళకి చెప్పండి. వాళ్లు అర్థం చేసుకుంటారు అనుకోవడం పొరపాటు.
మీ ఆలోచనలని, మీరు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడు అర్థం చేసుకోకపోతే మీరు ఏమైనా చెయ్యొచ్చు అంతే కానీ మౌనంగా మీరు ఉండిపోయి వాళ్ళని నిందించడం మీ తప్పు.
ఎప్పుడూ కూడా ఆనందంగా ఆలుమగలు ఉండాలంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం ప్రతిదీ మెదడులో మెదులుతూ ఉంటే పరిష్కారం దొరకదు. మాట్లాడి చూడండి ఆనందం మీ సొంతం అవుతుంది. సమస్య మీ నుండి దూరం అవుతుంది.