పదవులు లేవు ఇంటి పట్టునే ఉండాలి
కానీ ఉండరు. అన్న ఎర్రన్న నేర్పిన విలువల ప్రకారం
జనం మధ్యనే ఉంటారు..జనం కోసం పోరాటాలు చేస్తారు
ఆరోగ్యం సహకరించని రోజుల్లోనూ అలానే పనిచేశారు
మంచి ఫలితాలు అందుకోవడం సులవు వాటిని నిలుపుకోవడమే కష్టం ..అంటారే ఆ విధంగా అనేందుకు చెప్పేందుకు అచ్చెన్న రాజకీయ జీవితమే ఓ తార్కాణం.ఓ నిలువెత్తు నిదర్శనం. ఇవాళ ఆయన బర్త్ డే.
కార్మిక శాఖకు మంత్రిగా పనిచేశారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ విభాగం బాధ్యతలు చూస్తున్నారు. అన్నయ్య కింజరాపు ఎర్రన్నాయుడి అడుగు జాడల్లో ఉన్నారు. అన్నయ్య కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు యువ ఎంపీగా ఉన్నారు. అన్న కూతురు ఆదిరెడ్డి భవాని రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆ ఇద్దరు బిడ్డలూ తనకు బిడ్డలతో సమానం. తన ఇంటి బిడ్డలు అయిన ఇద్దరు కొడుకులు కన్నా ఎక్కువ ఆయనకు. యువ ఎంపీ రామూ ఎదుగుదల చూసి పొంగిపోతారు. అన్నయ్యను స్మరిస్తూ రాజకీయ జీవిత ప్రయాణం ఇంకొన్ని ఏళ్లు సునాయాసంగా సాగిస్తాను అని అంటారు. నా వరకు అన్నయ్యే రాజకీయ గురువు.. ఆయన నా దారి దీపం అని కూడా అంటారు. వదినమ్మ విజయమ్మ మాట జవ దాటిన దాఖలాలే లేవు అని అంటారాయన.
రాజకీయాల్లో ఎన్నో మార్పులు రావొచ్చు. పదవులు రావొచ్చు,పోవచ్చు కానీ కింజరాపు కుటుంబానికి శ్రీకాకుళం జిల్లాలో మంచి స్థానం ఉంది. ఓ బీసీ నేతగా ఆ రోజు ఎర్రన్న రాజకీయ అరంగేట్రం చేశారు.ఎన్నో అవస్థలు పడ్డారు. ఎంతో జీవితాన్ని చూశారు. పదవులు లేని వేళ ప్రజా పోరాటాలు చేశారు. ప్రజల మధ్యే ఉన్నారు. పదవులు వరించిన వేళ తన ప్రాంతానికి ఏం చేయాలో చేశారు. ఇంకా చేయాలని ఉన్నా కూడా చేయలేని అసక్తతతో అంతర్మథనం చెందారు. ఆ ఇంటి నుంచి అచ్చెన్న వచ్చారు.
ఈ సారి ఆయనను ఓడించండి అని జగన్ తన శ్రేణులకు చెప్పారు. కానీ కుదరలేదు.
ప్రజా దీవెనలు పుష్కలంగా ఉన్న అచ్చెన్న గెలుపు రాచబాట. ఆయన తిరుగులేని నేత. ఆయన మాటకు కట్టుబడి పనిచేసిన శ్రేణులన్నీ ఆ రోజు ఆయన గెలుపునకు ఎంతగానో శ్రమించాయి. ఇవాళ ఆయన బర్త్ డే డియర్ సర్ హ్యాపీ బర్త్ డే. మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజు ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు. విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. బాగా పనిచేసి అన్నయ్య పేరు నిలబెట్టారు. ఇప్పుడు మీరు విపక్ష నేత హోదాలో ఎన్నో అవరోధాలు దాటుకుని ప్రయాణిస్తూ ఉన్నారు. ముళ్లుంటే ఉండనీ..ముందుంది పూల బాటే! ఆల్ ద బెస్ట్ సర్.. మన లోకం న్యూస్ మీడియా తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు.
– రత్నకిశోర్ శంభుమహంతి శ్రీకాకుళం దారుల నుంచి…