IPL 2022 : క్యాచ్ పట్టకుండా ఏం పీ**న్నావ్.. షమిపై పాండ్యా సీరియస్.. వీడియో వైరల్

-

గుజరాత్ టైటాన్స్ తో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ 8 వికెట్ల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్ ను చిత్తు చేసింది. దీంతో వ‌రుస విజ‌యాల‌తో జోరు మీద ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ కు బ్రేక్ ప‌డింది. 163 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్.. ఓపెన‌ర్లు శుభ‌రాంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శ‌ర్మ (42), కేన్ విలియ‌మ్స‌న్ (57) ప‌రుగుల‌తో ర‌ఫ్ ఆడించి.. జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో ఈ సీజన్ లో గుజరాత్ తొలి ఓటమి మూటగట్టుకుంది.

అయితే ఈ మ్యాచ్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తన బౌలింగ్ లో రాహుల్ త్రిపాటి ఇచ్చిన కష్టమైన క్యాచ్ ను మహమ్మద్ షమీ నేలపాలు చేశాడని హార్దిక్ పాండ్యా సీరియస్ అయ్యాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ పాండ్యా వేయగా … 2, 3 బంతులను కేన్ విలియమ్సన్ సిక్సర్లు గా మలిచాడు.

ఇక చివరి బంతిని బ్యాక్ ఆఫ్ లెన్త్ గా పాండ్యా వేయగా… రాహుల్ త్రిపాఠి అప్పర్ కట్ ఆడాడు. అయితే బంతి గాల్లోకి లేచి నేరుగా…డీప్ థర్డ్ మ్యాన్ లో పడింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షమీ ఆ బంతిని అందుకోలేకపోయాడు. దీంతో పచ్చి బూతులు తిట్టాడు హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version