గొప్ప విజయాలు మాట్లాడతాయి.. సత్ సంకల్పాలు నెరవేర్చేందుకు దోహదపడతాయి. ఆ శుభ పరిణామంలో మంత్రి హరీశ్ రావు భాగం పంచుకున్నారు. ఈ ఉదయం విజేతలతో భేటీ అయి, ఎన్నో వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. దేశం గర్వించే విధంగా రూపుదిద్దుకున్న తెలంగాణ తేజాలను మనఃస్ఫూర్తిగా అభినందించి, ఆత్మీయ సత్కారం అందించారు. ఆ వివరం
ఈ కథనంలో..
వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఓ మంచి పని చేశారు. తనవంతు సాయం సివిల్స్ విజేతలకు చేయాలన్న సంకల్పంతో ఇవాళ ఓ మంచి పని చేశారు. ఒక్కొక్కరితో మాట్లాడుతూ, వారికి దారి చూపిన, వారిని విజేతలుగా మలిచిన విషయ నిపుణురాలికి ఆత్మీయ సత్కారం అందించారు. ఇవాళ భాగ్యనగరిలో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్, మెంటార్ బాల లతను అభినందించారు. వీరి విజయానికి కారణం అయిన ఆ విషయ నిపుణురాలి మార్గ నిర్దేశకత్వాన్ని అభినందించారు. ఆమెకు ఆత్మీయ సత్కారం అందించారు. అక్కడే సివిల్స్ విజేతలతో భేటీ అయ్యారు. వారితో బ్రేక్ ఫాస్ట్ మీట్ ను ఏర్పాటుచేశారు. వారి విజయానికి దోహదపడిన పరిణామాలు, గెలుపు సూత్రాలు వీటన్నింటి గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి హరీశ్ రావు చూపిన చొరవను ఇప్పుడు నెటిజన్లు అంతా అభినందిస్తున్నారు. ఇటువంటి మంచి పనులు విజేతల్లో ఆనందాన్ని నింపడమే కాదు బాల లత లాంటి అంకిత భావంతో పనిచేసే విషయ నిపుణులకు ఓ చక్కని ప్రోత్సాహం అని సోషల్ మీడియాలో అభిప్రాయ పడుతున్నారు ఇంకొందరు.
తెలంగాణ గర్వించేలా, దేశం మెచ్చేలా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. బాలలత లాంటి మెంటార్స్ సలహాలు, సూచనల వల్ల విజయావకాశాలు మరింత చేరువ అవుతాయన్నారు. పోలియో మహమ్మారి రూపంలో వైకల్యం కలిగినా, గెలుపు మీద కసితో రెండు సార్లు సివిల్స్ ర్యాంకు సాధించడం గొప్ప విషయం అని కితాబిస్తూ, భవిష్యత్ లోనూ ఇదే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సన్మానం అందుకున్న వారిలో యూపీఎస్సీ -2021లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు జి.సుధీర్ రెడ్డి (69), స్నేహ (136), చైతన్య రెడ్డి (161), రంజిత్ కుమార్ (574), స్మరణ రాజ్ (676) ఉన్నారు. అనంతరం మంత్రికి విజేతలు కృతజ్ఞతలు తెలిపారు.జిత్ కుమార్ (574), స్మరణ రాజ్ (676) ఉన్నారు. అనంతరం మంత్రికి విజేతలు కృతజ్ఞతలు తెలిపారు.