వేసవిలో ఈ డ్రింక్స్ తీసుకోండి.. ఎంతో రిలీఫ్ గా ఉంటుంది..!

-

వేసవికాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. నిజానికి వేసవిలో చాలా రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వేసవి కాలంలో ఎండల వల్ల చిరాకుగా ఉంటుంది. డీహైడ్రేషన్ మొదలు రకరకాల సమస్యల తో ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైగా ఎన్ని నీళ్లు తాగిన దాహం తీరదు. వేసవి కాలంలో రిఫ్రెష్ గా ఉండాలంటే ఈ డ్రింక్స్ ని తప్పక తీసుకోండి. మరి ఎటువంటి వాటిని తీసుకోవాలని అనేది ఇప్పుడు చూద్దాం. వేసవిలో డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇటువంటి సమయంలో నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి దాంతో పాటుగా శక్తిని ఇచ్చే డ్రింక్స్ ని కూడా తీసుకుంటూ ఉండండి ఇక మరి మండే వేసవిలో ఎలాంటి డ్రింక్స్ ని తీసుకోవాలని ఇప్పుడు చూద్దాం.

చెరుకు రసాన్ని వేసవికాలంలో తీసుకుంటూ ఉండండి. వేసవికాలంలో వేడి నుండి ఉపశమనం లభిస్తుంది చెరుకు రసంలో కొద్దిగా పుదీనా అల్లం నిమ్మకాయ వేసారంటే ఇంకాస్త లాభాన్ని పొందొచ్చు. ఐస్ లేకుండా తీసుకోవడం మంచిది.

మజ్జిగ కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది మజ్జిగ శరీరాన్ని చల్లగా మారుస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్ధకం సమస్య కూడా ఉండదు.
పుచ్చకాయ కూడా వేసవిలో చక్కటి రిలీఫ్ ని ఇస్తుంది. హైడ్రేట్ గా మిమ్మల్ని ఉంచుతుంది. పోషక పదార్థాలు కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. దాహం కూడా తీరుతుంది.

కొబ్బరి నీళ్లు కూడా వేసవిలో చక్కటి ప్రయోజనాన్ని మీకు ఇస్తాయి కొబ్బరినీళ్ళని వేసవిలో తీసుకుంటే చల్లగా శరీరం మారుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు అవుతుంది.
జీరా వాటర్ ని కూడా మీరు తీసుకుంటూ ఉండండి. జీరా వాటర్ ని తీసుకుంటే శరీరం చల్లగా మారుతుంది జీర్ణ సమస్యలు కూడా ఉండవు.

అలానే వేసవిలో మెంతులతో చేసిన టీ కూడా తీసుకోండి ఇది చల్లనిగా మిమ్మల్ని మారుస్తుంది. దానిమ్మరసం సబ్జా కూడా చాలా చక్కగా పనిచేస్తాయి కాబట్టి మీరు వేసవికాలంలో వీటిని చేర్చుకోవడం మంచిది. అప్పుడు ఎంతో రిఫ్రెష్ గా రిలీఫ్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news