ఇటీవల భారత దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. ఈ వరదల వల్ల ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వర్ష ధాటికి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు.. తెలిసి కూడా కొందరు చేసిన తప్పుల వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటనల వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
ఉజ్జయిని జిల్లా మహిద్‌పూర్‌లో ఓ బొలెరో వాహనం వరదల్లో కొట్టుకుపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. బొలెరో వాహనం బ్రిడ్జి దాటుతున్న క్రమంలో వరద ప్రవహ తీవ్రతో కారు.. ఆ వరదల్లోనే కొట్టుకుపోయింది. అయితే కొద్ది దూరం వెళ్లాక వాహనం ఆగిపోయింది. దీంతో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మరెప్పుడూ ఇలాంటి స్టండ్ చెయ్యొద్దని పలు నెటిజన్లు సలహా ఇస్తున్నారు. కాగా, ఈ వీడియోను అభిషేక్ రాయ్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.
उफनते नाले में तिनके की तरह बह गई बोलेरो, गाड़ी फंसते ही उतर गए थे तीन सवार…उज्जैन जिले के महिदपुर की घटना #HeavyRain #Viral #Ujjain pic.twitter.com/RzBlia20Bb
— Abhishek Roy (@abhiroy127) July 19, 2022