హైదరాబాద్ ను ఏపీలో కలిపేయమని అడగగలమా? అని పోలవరంపై బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఎత్తు ఎవరు పెంచారు.?? డిజైన్ల ప్రకారమే జరుగుతోంది దాన్ని ఎవరూ మార్చలేదని ఆగ్రహించారు బొత్స సత్యనారాయణ. భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించిన అంశంమేనని.. విభజన చట్ట ప్రకారంమే అంతా జరుగుతోందని పేర్కొన్నారు.
వందేళ్ల తర్వాత మొదటిసారి ఈ నెలలో గోదావరికి ఇంత పెద్దఎత్తున వరద వచ్చిందని.. రాష్ట్రవిభజన వల్ల హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందని గుర్తు చేశారు. హైదరాబాద్ ను ఏపీలో కలిపేయమని అడగగలమా? ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపేస్తే ఎవరికీ ఇబ్బంది లేదు కదా అని నిలదీశారు. ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని.. సమస్యల పరిష్కారమే ఇప్పుడు ముఖ్యం అని చెప్పారు. కొం
దరు వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాల్సి ఉంది.. సీఎం అయినా, మంత్రులైనా బాధ్యతగానే మాట్లాడాలని కోరారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరికాదు..పువ్వాడ అజయ్ అయన సంగతి ఆయన చూసుకోవాలని హెచ్చరించారు. ముంపు మండలాల బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని.. ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల సంగతి ఆయన చూసుకుంటే సరి పోతుందని పేర్కొన్నారు.