ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని మంత్రి దనసరి అనసూయ (సీతక్క) విజ్ఞప్తి చేశారు.
గత 10 సంవత్సరాలుగా పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేసిన మల్లన్నను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉన్నదని అన్నారు. ప్రశ్నించే గొంతు, పట్టభద్రుల ఆత్మబంధువు తీన్మార్ మల్లన్న అని ప్రశంసల వర్షం కురిపించారు.పట్టభద్రుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన అభ్యర్థిగా ఎంపిక చేసిందన్నారు. దొరల పాలన సాగించిన కేసీఆర్‌పై తీన్మార్ మల్లన్న తనదైన శైలిలో పోరాటం చేశారని, ప్రజల పక్షాల నిలిచి పోరాటం చేశారని గుర్తు చేసింది.అలాంటి వ్యక్తులను చట్ట సభల్లోకి పంపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదన్నారు సీతక్క.
ఇదిలా ఉంటే… రాష్ట్రానికి చెందిన పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్ అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఎవరెస్టు ఎక్కి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా పూర్ణను సీతక్క అభినందించారు.