ఈరోజుల్లో చాలా మంది తమ టాలెంట్ ను బయట పెడుతున్నారు.అసాధ్యం అనుకున్న వాటిని సాధించి చూపిస్తున్నారు.. అంతేకాదు.. గిన్నిస్ రికార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు నిత్యం ఏదొకటి వైరల్ అవుతున్నాయి.. అందులో కొన్ని జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పుడు మరో వ్యక్తి తనలోని టాలెంట్ ను బయట పెట్టాడు. సాధారణంగా ఒక కోన్‌పై ఒకే ఐస్ స్కూప్ పెడతారు. కొన్నిసార్లు కస్టమర్ కోరిక మేరకు రెండు పెట్టిన సందర్భాలుంటాయి.. అయితే, ఒకే కోన్ పై ఒకటికాదు..రెండు కాదు.. 125 ఐస్ స్కూప్‌లను పెట్టడం ఎప్పుడైనా చూశారా? అసలు అలా పెట్టడం సాధ్యమే అంటారా? ఇటలీకి చెందిన దిమిత్రీ పాన్‌సియేరా అనే వ్యక్తి సాధ్యమే అని నిరూపించాడు.
అంతేకాదు.. గిన్నిస్‌బుక్ లో చోటు కూడా సంపాదించాడు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్‌వరల్డ్ రికార్డు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. దీంతో ఈ సంగతి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాన్‌సియేరా.. ఒకే కోన్‌పై రంగురంగుల ఐస్ స్కూప్‌లను ఒకదానిపై ఒకటి ఉంచడం ఇందులో చూడొచ్చు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఐస్‌క్రీం అంటే ఆ మాత్రం సైజుండాలి మరి, ఈ రికార్డును బ్రేక్ చేసేదెవరు?.. దీన్ని తినేదెవరు? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. మరి కొంత మంది బొంగు అయితే ఎప్పుడో విరిగి పొయ్యెది ఇది ఏందీ మరి అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా కూడా ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.