Naga Shaurya : నేడు హీరో నాగశౌర్య పెళ్లి..

-

ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య బ్యాచిలర్‌ లైఫ్‌కి గుడ్ బై చెప్పనున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నాడు నాగ‌శౌర్య. నేడు త‌న బ్యాచిల‌ర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పనున్నాడు. పెద్దలు చూసిన అమ్మాయిని నేడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంటీరియర్ డిజైనర్‌గా ఉన్న అనూష శెట్టి ని వివాహమాడనున్నాడు సంప్రదాయబద్దంగా బంధు, మిత్రుల సమక్షంలో బెంగుళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో వీరి పెళ్లిని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుక‌ల్లో భాగంగా నిన్న హాల్దీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అనంత‌రం కాక్‌టైల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో శౌర్య త‌న‌కు కాబోయే భార్య అనూష శెట్టి వేలికి ఉంగ‌రం తొడిగాడు.

Naga Shaurya Engagement | Zee News Telugu

కుటుంబ స‌భ్యులు, మిత్రుల స‌మ‌క్షంలో ఈ వేడుక‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. వీరిద్ద‌రి జోడి బాగుందంటూ నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా హీరో నాగశౌర్యను పెళ్లి కొడుకును చేశారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బంధువు, కుటుంబ సన్నిహితుల మధ్య పెళ్లి కొడుకు వేడుకను గ్రాండ్‌గా జరిపారు. అతి తక్కువ మందిని మాత్రమే ఈ పెళ్లి కొడుకును తయారు చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. కాబోయే నూతన వధువరులు నాగశౌర్య, అనూషా శెట్టితో పాటు హీరో సోదరుడు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెంగళూరులోని జెడబ్ల్యూ మారియట్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ముందుగా నిశ్చయించిన సమయం ఉదయం 11.25గంటలకు నాగ‌శౌర్య నూతన వధువు అనూష మెడలో బంధు, మిత్రుల సమక్షంలో మూడు ముళ్లు
వేయనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news