నిన్న‌టితో వంద త‌ప్పులు అయిపోయాయ్…హీరో నారా రోహిత్ ఫైర్..!

-

నిన్న అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై ఒక‌రొక‌రుగా స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే నంద‌మూరి బాల‌య్య మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగా తాజాగా హీరో నారా రోహిత్ సైతం నిన్న అసెంబ్లీలో జ‌రిగిన ప‌రిణామాల‌పై తీవ్రంగా మండిప‌డ్డారు. ప‌శువుల కంటే హీనంగా కొంద‌రు అధికార‌పార్టీ నేత‌లు ప్ర‌వర్తిన్నార‌ని నారా రోహిత్ అభిప్రాయప‌డ్డారు. స‌మ‌స్య‌ల గురించి చ‌ర్ఛించాల్సిన అసెంబ్లీలో చంద్రబాబును ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిని దూశించ‌డం దిగ్భ్రాంతికి గురిచేసింద‌న్నారు. రాజ‌కీయాల‌పై…విధానాల‌పై విమ‌ర్శ‌లుండాలి గానీ కుటుంబ స‌భ్యుల‌ను లాగ‌టం స‌రికాద‌న్నారు. రాజ్యాంగం క‌ల్పించిన వాక్ స్వాతంత్య్రం హ‌క్కును దుర్వినియోగం చేస్తున్నార‌ని అన్నారు.

చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం వారి భ్రమే అవుతుందన్నారు. చంద్ర‌బాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉన్నారని….. అందుకే వారి మనుగడ సాగిందని నారా రోహిత్ పేర్కొన్నారు. శిశుపాలుడిలాగే నిన్నటితో వారి వంద తప్పులు పూర్తయ్యాయని ఇక‌ వారి అరాచకాన్ని ఉపేక్షించేది లేదని నారా రోహిత్ మండిప‌డ్డారు. ప్రతి ఒక్క తెలుగు దేశం కార్యకర్త.. వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారని నారా రోహిత్ వార్నింగ్ ఇచ్చారు. స్థాయిలేని వ్యక్తుల మధ్య రాజకీయాలు చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న అంటూ నారారోహిత్ ఎమోష‌న‌ల్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version