‘ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది’.. అంటూ రానా ట్వీట్

-

టాలీవుడ్ యంగ్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాలో బల్లాల దేవా అనే క్యారెక్టర్ చేసి ఓ రేంజ్ హీరోగా ఎదిగాడు. అయితే ఇటీవల హీరో రానా విరాటపర్వం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అడుగుల వేణు దర్శకత్వంలో… తెరకెక్కే గా… సాయి పల్లవి వి సి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నివేదా పేతురాజ్ మరియు నందితా దాస్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హీరో రానా… తాజాగా తనపై వార్త రాసిన ఓ వెబ్సైట్ కు సెటైరికల్ రిప్లై ఇచ్చాడు. రానా హీరోగా తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తప్పుకోనున్న వెబ్సైట్ ప్రత్యేక కథనం రాసింది.

అయితే దీనికి రిప్లై ఇచ్చిన హీరో రానా… ” ఎవడు బ్రో నీకు చెప్పింది… నీ సోది” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. హీరో రానా కు సపోర్ట్ చేస్తూ నెటిజన్లు కూడా ఆ వెబ్ సైట్ పై సెటైర్లు వేశారు. నెటిజన్ల కామెంట్ల దెబ్బకు ఆ వెబ్సైట్ యాజమాన్యం ఆర్టికల్ను పూర్తిగా డిలీట్ కూడా చేసేసింది. కాగా ప్రస్తుతం హీరో రానా భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version